వైజాపూర్‌లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

కలం, గుడిహత్నూర్: గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. శనివారం గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామంలో (Vaijapur village) నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. నిపుణులైన వైద్యుల బృందం రోగులను క్షుణ్ణంగా పరీక్షించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.

మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని, ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కోటే, డీఎంహెచ్‌ఓ సాధన, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, స్థానిక సర్పంచ్, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>