కలం, హనుమకొండ: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రుల మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి (Collector Chahat Bajpai)కు దేవాలయ ఆలయ కార్య నిర్వహణ అధికారి సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు కలెక్టరేట్ లో ఆహ్వాన పత్రికను అందజేశారు.
భద్రకాళి దేవాలయంలో (Bhadrakali Temple) దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవం, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కు ఆలయ ఈవో, ప్రధానార్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ తప్పకుండ విచ్చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

