కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం లాంటి బతుకమ్మ పండుగకు (Bathukamma Festival) భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు (CS Sanjay Jaju) అధికారులను ఆదేశించారు. అక్టోబర్ పదో తేదీ నుంచి 18వ తేదీ వరకు ఘనంగా వేడుకలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 18న సద్దుల బతుకమ్మ రోజున ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళలతో అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అదే రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ట్యాంక్ బండ్‌పైకి చేరుకుంటారన్నారు. వీరితో పాటు వందలాది మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఇస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేకంగా వేదిక కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రధాన కూడళ్లలో బతుకమ్మల కటౌట్లు..
తెలంగాణ సంస్కృతికి విశిష్ట శోభను తెచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో బతుకమ్మల కటౌట్లు ఏర్పాటు చేయాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. అంతేగాకుండా, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యద్దీపాలతో అందంగా అలంకరించాలన్నారు. ట్యాంక్ బండ్‌పైకి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బంది కలగకుండా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు వేడుక నిర్వహించబోతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. రవీంద్ర భారతిలోనూ పది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను అధికారంగా నిర్వహిస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రత్యేక లోగో ఏర్పాటు..
ఈసారి బతుకమ్మ ఉత్సవాల (Bathukamma Festival) సందర్భంగా ప్రత్యేకంగా లోగో రూపొందిస్తున్నట్లు సంజయ్ జాజు తెలిపారు. అంతేగాకుండా డిసెంబరులో జరగబోయే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను తెలియజేసేలా లోగో డిజైన్ చేయిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా వేడుకలు వైభవంగా జరిగేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో వీఐపీలు పాల్గొనబోతునందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు.
Also Read : రాష్ట్రంలో విద్య, వైద్యంపై సీఎం రేవంత్ సమీక్ష
Follow Us On: X(Twitter)

