మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, ఉట్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉట్నూర్ మండలం సుద్దగూడ గ్రామ పర్యటన నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ (MLA Bojju Patel) ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన సందర్శించి, కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అవసరాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని బొజ్జు పటేల్ సూచించారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>