తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు

కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన ఆకస్మికంగా రద్దయింది. అనివార్య కారణాల వలనే రేపటి టూర్ రద్దు చేసుకున్నారని అమిత్ షా కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని లోక్ భవన్ లో బస చేస్తారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు మెదక్ జిల్లాలోని తూప్రాన్‌కు వెళ్లి అక్కడ అమూల్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. అక్కడి నుంచి కరీంనగర్ వెళ్లి ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Prathima Medical College) రజతోత్సవ వేడుకల్లో పాల్గొనాలి. అనంతరం విద్యార్థులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం వివరించారు.

ఆందోళనల కారణంగానే రద్దయిందా..?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన చివరి నిమిషంలో రద్దు కావడంపై రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది. తెలంగాణలో సర్ ప్రక్రియపై అధికార కాంగ్రెస్ పార్టీ  ఇప్పటికే ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ, అమిత్ షా ఎన్నికల సంఘం వెనక ఉండి ఓట్లు తీసేస్తున్నారని సీఎం రేవంత్ సైతం పలుమార్లు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా వస్తే కాంగ్రెస్ శ్రేణులు అనూహ్యంగా ఆందోళనలు చేపట్టి అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందనే టూర్ రద్దు చేసుకున్నారా..? అనే ఊహాగానాలొస్తున్నాయి. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో అమిత్ షా పర్యటించాల్సి ఉండగా.. నిఘా వర్గాల సమాచారంతోనే చివరి నిమిషంలో తెలంగాణకు రావడాన్ని విరమించుకున్నారా..? అనే అభిప్రాయాన్ని పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడం ఇది రెండోసారి గమనార్హం.

Also Read : చ‌రిత్ర సృష్టించిన ప్ర‌ణ‌వి ఉర్స్‌..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>