కలం, జోగులాంబ గద్వాల : ఇల్లరికం వచ్చిన భర్త ఇంటి ఇల్లాలిని కడతేర్చిన ఘటన శనివారం ధరూర్ మండలం ఓబులోంపల్లి (Obulampalle) గ్రామంలో చోటు చేసుకుంది. ధరూర్ మండలం ఓబులోంపల్లి గ్రామామికి చెందిన అనంతమ్మ నర్సింహులు దంపతుల కుమార్తె జమ్ములమ్మను(35) గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన గోపితో వివాహం జరిగింది. 17 ఏండ్ల క్రితం గోపిని ఇల్లరికం తెచ్చుకున్నారు.
అయితే గత కొంతకాలంగా గోపి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో గోపి తన భార్య జములమ్మ (35)పై రోకలి బండతో దాడి చేయడంతో ఆమె సంఘటన స్థలంలో మృతి చెందింది. ఘటన అనంతరం గోపి పరారైనట్లు సమాచారం. గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన గోపి సుమారు 17 ఏళ్ల క్రితం ఓబులోనిపల్లికి ఇల్లరికం వచ్చి జములమ్మను వివాహం చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానంతో గోపి తరచూ జములమ్మతో గొడవపడేవాడని, గత రెండేళ్లుగా వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ నందీకర్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

