కలం, సోన్: సోన్ (Soan) మండలం మాదాపూర్ గ్రామ ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్ ప్రమాదం (Bike Accident) చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44పై బైక్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్సై దేవన్న శుక్రవారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ (Nirmal) పట్టణంలోని బాగులవాడ కాలనీకి చెందిన పోగుల రమేష్ గురువారం మాదాపూర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో నిర్మల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ను నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై దేవన్న వెల్లడించారు.

