యాదగిరిగుట్ట భక్తుల ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలోని ప్రసాదాల విభాగాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ పి. స్వాతి పరిశీలించారు.  దేవస్థానానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ జారీ చేసే ప్రక్రియలో భాగంగా ప్రసాదాల తయారీ, ముడి పదార్థాల నిల్వ, తయారీ ప్రదేశాల పరిశుభ్రత, ప్యాకింగ్, భక్తులకు పంపిణీ విధానాలను సమగ్రంగా తనిఖీ చేశారు.

ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల నాణ్యత, ఆహార పదార్థాల భద్రత, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రసాదాలను అందించాలని దేవస్థానం అధికారులకు సూచనలు చేశారు.

తనిఖీ అనంతరం ప్రసాదాల విభాగంలో పాటిస్తున్న ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించి దేవస్థానానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ను (Food Safety License) జారీ చేశారు. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రసాదాలను అందించేందుకు దేవస్థానం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ ఐఏఎస్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>