హ‌క్కుల‌ను కాల‌రాస్తే ప్ర‌జ‌లు ఊరుకోరు: ష‌బానా ఆజ్మీ

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కాల‌రాస్తే ఎవ్వ‌రూ ఊరుకోర‌ని ప్ర‌ముఖ న‌టి ష‌బానా ఆజ్మీ (Shabana Azmi) అన్నారు. ముంబ‌యిలోనిలో శివాజీ పార్క్‌లో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న నిర‌స‌న‌ల్లో (CJP Protest) ఆమె పాల్గొన్నారు. ఎన్నిక‌లం సంఘం తీరుపై సీజేపీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. స‌ర్ ప్ర‌క్రియ‌లో జ‌రిగిన త‌ప్పిదాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ సీఈసీ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ష‌బానా ఆజ్మీ సీజేపీ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి, హక్కులకు సంబంధించిన ప్రశ్న అని అన్నారు. చిన్నతనం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవాలని, హక్కులను ప్రశ్నించాలని నేర్పించారని, కానీ ప్రాథమిక హక్కులనే కాలరాస్తే, తారుమారు చేస్తే ప్రజలు ఊరుకోరని ఆమె హెచ్చ‌రించారు.

వేలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ష‌బానా ఆజ్మీ ఆరోపించారు. ప్రజల ఆగ్ర‌హం ఇప్పుడు ఆపలేనంతగా పెరిగిపోయింద‌ని, దేశవ్యాప్తంగా ఈ నిరసన జ్వాలలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. నేటి నిరసన తర్వాత ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందో లేక తాము ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలో చూడాలని చెప్పారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఎంతకాలమైనా కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>