ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త..!

కలం, వెబ్​ డెస్క్​ : ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలో ఆటో రిక్షా చార్జీలను (Auto Rickshaw Fares) సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఆటో చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చార్జీల ప్రకారం ఆటోల కనీస చార్జీ రూ.20 నుంచి రూ.30కి పెరగనుంది. అలాగే ప్రతి కిలోమీటర్‌కు రూ.11 నుంచి రూ.14కి చార్జీ పెరగనుంది.

అలాగే ఆటోల్లో డిటెన్షన్​ చార్జీని కూడా రాష్ట్ర ప్రభుత్వం సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 50 పైసలుగా ఉన్న డిటెన్షన్​ చార్జీని 75 పైసలకు పెరగనుంది. రాత్రి వేళల్లో వేసే చార్జీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలనే కొనసాగించనుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆటో మీటర్లను రీసెట్ చేసుకునేందుకు ప్రభుత్వం మూడు నెలల గడువు విధించింది. దాదాపు 12 ఏళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆటో చార్జీలను (Auto Rickshaw Fares) సవరించింది.

Also Read : మెట్రో-ఆర్టీసీ కామ‌న్ పాస్ వ‌చ్చేసింది!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>