సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని తీర్మానం

కలం, నిజామాబాద్ బ్యూరో: మూతపడిన సారంగాపూర్ నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి దానిని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని ఠాణా ఖుర్దు గ్రామ (Thana Khurd Village) పంచాయతీ తీర్మానం చేసింది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఠాణాఖుర్దు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి కుచన్‌పల్లి జలంధర్ రెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించారు.

గ్రామ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చెరకు ఉత్పత్తిదారుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో రైతులు చెరకు పండించేందుకు ముందుకొస్తున్న సందర్భంలో చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. ఈ మేరకు ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచి కంజర కిరణ్, పంచాయతీ కార్యదర్శి మృదుల, వార్డు సభ్యులు తిరుపతి, పూజ, సుప్రియ,రవి, కారోబారి గాజుల అరుణ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>