కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహాదేవన్ (R Mahadevan) శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన జస్టిస్ మహాదేవన్‌కు ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవాని శంకర్, ఐఏఎస్ స్వామివారి లడ్డు ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని జస్టిస్ మహాదేవన్‌కు అందజేశారు. అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, అర్చకులు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : షెడ్యూల్‌కే మురిసిపోతున్నారు.. పాక్‌పై పార్థివ్ పటేల్ సెటైర్లు!
Follow Us On : WhatsApp

