భారీ ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఐదుగురు దుర్మరణం

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ధర్మాంగాన్ వద్ద ఉన్న సమృద్ధి మహామర్గ్‌పై (Samruddhi Accident) శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోగా, ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బాధితులు షెగావ్ తీర్థయాత్రను ముగించుకుని తిరిగి వస్తున్నట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ దుర్ఘటనలో మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే హైవే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వాహనం నుంచి వెలికి తీశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం అమరావతిలోని సమీప ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంతో రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>