కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న ఒక ఇండిగో విమానం (IndiGo Flight)లో ఓ ప్రయాణికుడు అనుచితంగా వ్యవహరించి కలకలం సృష్టించాడు.
విమానం రన్ వే పైకి చేరుకుని టేక్ ఆఫ్ అయ్యే సమయానికి సదరు ప్రయాణికుడు అకస్మాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు.
అనంతరం విమానాన్ని నిలిపివేసి అతడిని శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ అనూహ్య ఘటనతో విమానంలోని మిగిలిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

