దివ్యాంగులకు బిగ్ రిలీఫ్.. నేటి నుంచే కొత్త రూల్స్!

కలం, వెబ్ డెస్క్ : దివ్యాంగులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ (Divyang Exempted FASTag ) జారీ, నవీకరణల నిబంధనల్లో కీలక సవరణలు చేసింది. గతంలో ఏడాదికోసారి ఫాస్టాగ్ రెన్యూవల్ చేసుకోవాల్సిన శ్రమను తప్పిస్తూ, వైకల్య శాతాన్ని బట్టి ఈ ఫాస్టాగ్ చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. జాతీయ రహదారులపై ప్రయాణించే దివ్యాంగుల వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద మినహాయింపు లభిస్తుంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 70 శాతం నుంచి 100 శాతం వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు కేటాయించే ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ 5 సంవత్సరాల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. అలాగే, 40 శాతం నుంచి 70 శాతం లోపు వైకల్యం కలిగిన వారికి 3 ఏళ్ల వ్యాలిడిటీతో ఈ ఫాస్టాగ్ జారీ చేస్తారు. ఈ నూతన విధానం వల్ల దివ్యాంగులు పదే పదే ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోర్టళ్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సుదీర్ఘకాలం టోల్ మినహాయింపు ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.

ఈ ఫాస్టాగ్ పొందేందుకు అర్హులైన దివ్యాంగులు NHAI లేదా ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో చెల్లుబాటు అయ్యే యూడీఐడీ కార్డ్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్‌కార్డ్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. వాహనం సదరు దివ్యాంగుడి పేరు మీద లేదా సదరు దివ్యాంగుడి కోసమే నడుపుతున్నట్లు ప్రూఫ్‌ ఉండాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>