కేఎల్‌యూ యూనివర్సిటీ లైబ్రరీలో భారీ పేలుడు

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ సమీపంలోని కేఎల్‌యూ (KLU) యూనివర్సిటీ లైబ్రరీ ప్రాంగణంలో భారీ పేలుడు (KLU Library Fire)సంభవించి ఒక్కసారిగా తీవ్రస్థాయిలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన విద్యార్థులు, కళాశాల సిబ్బంది భయాందోళనకు గురై ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

ఈ అగ్నిప్రమాదంలో లైబ్రరీలోని విలువైన పుస్తకాలతో పాటు ఫర్నిచర్ సంపూర్ణంగా కాలి బూడిదయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో లైబ్రరీలో విద్యార్థుల రద్దీ ఉన్నప్పటికీ, సకాలంలో బయటకు రావడంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని విశ్వవిద్యాలయ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>