హామీలు అమలు చేయాలి.. గ్రామీణ వైద్యుల డిమాండ్

కలం, సోన్ :  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులను (Rural Doctors) రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సోన్ (Soan) మండల తహసీల్దార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్లు జారీ చేయడంతో పాటు జీవన భృతి కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని పలువురు గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>