భద్రాద్రిలో స్వచ్ఛతా హి సేవా.. అధికారుల శ్రమదానం

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛతా హి సేవా –2026’(Swachhata Hi Seva 2026) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు, క్రీడాకారులు కలిపి సుమారు 580 మంది పాల్గొన్నారు. కళాశాల పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా చెత్తను తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలుగా నాలుగు రకాలుగా వేరు చేయడంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగుతూ పరిశుభ్రత సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. విద్యాచంద్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూషతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>