ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌పై ఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

క‌లం, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఉప ఎన్నిక (Khairatabad Bypoll) నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టుకు ఈసీ (EC) తరఫు న్యాయవాది నివేదిక సమర్పించారు. నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల పిటిషన్‌ ఇంకా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నందున, చట్టపరమైన నిబంధనలరీత్యా ఈ దశలో ఉప ఎన్నిక నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మ‌రోవైపు పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డి (Vijaya Reddy) సైతం ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌పై పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దానం నాగేంద‌ర్ ఎన్నిక‌పై 2024లో పిటిష‌న్ దాఖ‌లు చేశామ‌ని, అఫిడ‌విట్‌లో దానం నాగేంద‌ర్ త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని పేర్కొన్నారు. ఈ పిటిష‌న్ ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉంద‌ని, దీనిపై తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు ఈసీ ఉప ఎన్నిక‌కు (Khairatabad Bypoll) నోటిఫికేష‌న్ ఇవ్వ‌కుండా చూడాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ప్ర‌తివాదుల‌ను ఆదేశించింది.

Also Read : కళాకారుల జీవితాలతో చెలగాటమా..? కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>