కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్ ‘ఐకాన్జా’ (ICONZA)ను ప్రారంభించారు. తన తాత, ప్రముఖ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“కొత్త ప్రదేశం.. కొత్త అధ్యాయం.. కొనసాగుతున్న వారసత్వం” అంటూ తన కొత్త ప్రయాణానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. తన తాత అల్లు రామలింగయ్య జయంతి రోజునే కొత్త క్రియేటివ్ స్పేస్‌ను ప్రారంభించడం తనకు ప్రత్యేకమైన సందర్భమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. కొత్త ఆఫీస్ ద్వారా సృజనాత్మక ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులకు మరింత విస్తృతమైన వేదిక లభించనుంది. అల్లు రామలింగయ్య అందించిన స్ఫూర్తి, వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘ఐకాన్జా’ తో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు అల్లు అర్జున్ తెలిపారు.

