లా గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్: హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు

కలం, వెబ్ డెస్క్ : న్యాయ విద్యనభ్యసించిన వారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)మంచి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో 119 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలలో 96 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మిగిలిన 23 పోస్టులను ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు అక్టోబర్ 26 వరకు గడువు ఇచ్చారు.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. దరఖాస్తు రుసుముగా సాధారణ వర్గాల అభ్యర్థులకు రూ.1500, రిజర్వుడ్ కేటగిరీల వారి కోసం రూ.750గా నిర్ణయించారు. లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏపీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in ని సందర్శించి నిర్దేశిత గడువులోగా తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>