రోడ్డు భద్రత అందరి బాధ్యత: సీఐ భాస్కర్

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని అంగడి బజార్‌లో పట్టణ సీఐ బొడ్డుపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రత–ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం (Road Safety and Traffic Rules Awareness) నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రత అందరి బాధ్యత అని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నిబంధనలు పాటించాలని, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగాన్ని నివారించాలని సూచించారు. పాదచారులు జీబ్రా క్రాసింగ్‌ను వినియోగించాలని, ఓవర్‌టేక్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. రాత్రివేళల్లో, మలుపుల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎస్‌ఐ యాదయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి భద్రతకు సహకరించాలని పోలీసులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>