ఉడుతలపల్లి శివారులో వ్య‌క్తి అనుమానాస్పద మృతి!

కలం, మునుగోడు: నల్గొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి (Udathala Palle) గ్రామ శివారులో బైక్ మెకానిక్ అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కనగల్ మండలం పోనుగోడు గ్రామానికి చెందిన బండమీది శ్రీనివాస్ కురంపల్లి గ్రామంలో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం ఉడుతలపల్లి గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఉన్న గడ్డి పొదల్లో శ్రీనివాస్ విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పక్కనే ఆయన బైక్ కూడా పడి ఉంది.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పలు అనుమానాలు.. దర్యాప్తు ముమ్మరం..

సమాచారం అందుకున్న చండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం లభించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదమా? ఎవరైనా వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయారా? లేక అదుపుతప్పి పడిపోయి మృతి చెందారా? లేక ఎవరితోనైనా గొడవల నేపథ్యంలో హత్య చేసి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు:

తమ కుమారుడి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, లోతుగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. “పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి గల అసలు కారణం, గాయాల స్వభావం, ఏమైనా మత్తు పదార్థాలు తీసుకున్నారా అనే అంశాలు స్పష్టంగా తెలుస్తాయి” అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పోనుగోడు, కురంపల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Also Read : దేవుళ్లను విభజించే యత్నం సనాతన ధర్మానికే విరుద్ధం: బండి సంజయ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>