సాదాసీదాగా నిర్మల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం

కలం, నిర్మల్ : నిర్మల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం (Nirmal Municipal Council Meeting) బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన సజావుగా జరిగింది. ఈ సందర్బంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలపై వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో చర్చించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వైస్ చైర్మన్ ఆదేశించారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా కౌన్సిల్ నిరంతరం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, డీఈ హరిభువన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Also Read : దేవుళ్లను విభజించే యత్నం సనాతన ధర్మానికే విరుద్ధం: బండి సంజయ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>