ప్రేమ పేరుతో సైకో వేధింపులు.. ఖమ్మం కోర్టు కీలక తీర్పు

కలం, ఖమ్మం బ్యూరో :  ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు (Minor Girl Harassment) గురిచేసిన ఓ యువకుడికి ఖమ్మం కోర్టు (Khammam Court) కఠిన శిక్ష విధించింది. వేధింపులకు పాల్పడిన నిందితుడు చెకూరి శ్రీకాంత్ (20)ను దోషిగా నిర్ధారిస్తూ మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణ అర్జున్ తీర్పు వెలువరించారు. కేసు వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నగరానికి చెందిన చెకూరి శ్రీకాంత్ ప్రేమ పేరుతో ఓ మైనర్ యువతిని తీవ్రంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు (POCSO Case) నమోదు చేశారు. కోర్టులో సుదీర్ఘంగా సాగిన విచారణలో నిందితుడిపై నేరం ఆధారాలతో సహా రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్షను ఖరారు చేశారు.

ఈ కేసులో వన్‌టౌన్ ఎస్‌ఐ ఎస్. శ్రీకాంత్ సమర్థవంతంగా దర్యాప్తు జరిపి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి బలమైన వాదనలు వినిపించగా, బాధితురాలికి న్యాయం జరిగేలా భరోసా లీగల్ ఆఫీసర్ ఎం. ఉమారాణి సహకరించారు. కోర్టు లైజన్ అధికారులుగా ఎస్‌ఐ కె. శ్రీకాంత్, ఎం. అయూబ్ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించారు. నేరస్తుడికి శిక్ష పడేలా చేసి, బాధితురాలికి వేగంగా న్యాయం చేకూర్చిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూటర్, లైజన్ సిబ్బందిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) ప్రత్యేకంగా అభినందించారు.

Also Read : ఇండి కూటమి కీలక తీర్మానాలు.. అక్టోబర్ 2 నుంచి సేవ్​ డెమొక్రసీ మార్చ్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>