దేశంలో పెను సంచ‌ల‌నం.. వేణు స్వామి మ‌రో జోస్యం!

క‌లం, వెబ్‌డెస్క్: ప్ర‌ముఖ జోతిష్య నిపుణుడు వేణుస్వామి (Venu Swamy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గ్ర‌హాల తీరు విభిన్నంగా న‌డుస్తోంద‌ని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. దేశంలో కొన్ని పెను సంచ‌ల‌నాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ముందు ముందు రోజుల్లో చాలా స‌మ‌స్య‌లు రానున్నాయ‌ని చెప్పారు. మ‌ధ్య త‌ర‌గ‌తి, దిగువ, ఎగువ‌ మ‌ధ్య త‌ర‌గ‌ది ప్ర‌జ‌లు డ‌బ్బును కాపాడుకోవాల‌ని సూచించారు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రూ త‌మ వ‌ద్దే న‌గ‌దు ఉంచుకోర‌ని, ఎవ‌రికైనా అప్పు ఇవ్వ‌డం, ఎక్క‌డైనా ఇన్వెస్ట్ చేయ‌డం వంటివి చేస్తుంటార‌ని వ్యాఖ్యానించారు. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇలాంటివి చేయొద్ద‌ని సూచించారు. అప్పులు ఇచ్చిన డ‌బ్బు వెన‌క్కి రాద‌ని, ఇన్వెస్ట్ చేస్తే న‌ష్ట‌పోతార‌ని హిత‌వు ప‌లికారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో వ్యాపారాలు, ఇన్వెస్ట్‌మెంట్ చేయాల‌నుకునే వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు.

ఇక దేశంలో త్వ‌ర‌లో కొన్ని సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటాయ‌ని కొద్ది రోజుల నుంచి తాను చెప్తూనే ఉన్నాన‌ని వేణుస్వామి (Venu Swamy) అన్నారు. దేశ ప్ర‌ధానికి, హోం మంత్రికి ప‌ద‌వీ స‌మ‌స్య‌లు, ఆరోగ్యప‌రమైన ఇబ్బందులు రాబోతున్నాయ‌ని చెప్పారు. ఇవి రాజ‌కీయంగా చాలా సంచ‌ల‌నాల‌కు కార‌ణంగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు. అలాగే భార‌త్‌కు, పాకిస్తాన్‌కు యుద్దం జ‌రిగే చాన్స్ కూడా ఉంద‌ని వేణుస్వామి చెప్పారు. ఈ యుద్ధంతో నిత్యావ‌స‌రాలకు ఇబ్బంది క‌లిగే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల‌ను పొదుపుగా వాడుకుంటూ, నిల్వ ఉంచుకోవాల‌ని సూచించారు. నూనె, బియ్యం, ప‌ప్పులు అన్నింటిని ఎక్కువ‌గా ఉంచుకోవాల‌న్నారు. రాజ‌కీయాల గురించి ఎవ‌రూ, ఎవ‌రితో వాదించ‌వ‌ద్ద‌ని వేణుస్వామి చెప్పారు. దాని వ‌ల్ల స‌మ‌స్య‌లు తీవ్ర‌మై కొట్టుకునే స్థాయికి వెళ్లే అవ‌కాశం ఉంద‌న్నారు. రానున్న రోజుల్లో ఓడ‌లు బండ్లు, బండ్లు ఓడ‌లు అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. 2027లో కొన్ని రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని, వాటి ఫలితాల‌పై ఎట్టి ప‌రిస్థితుల్లో బెట్టింగులు వేయొద్ద‌ని చెప్పారు. 2029 వ‌ర‌కు జర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కూడా పూర్తిగా విరుద్ధ‌మైన ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా తిర‌గ‌బ‌డే చాన్స్ ఉంద‌ని చెప్పారు. బెట్టింగ్స్‌లో డ‌బ్బులు పెట్టి ఎవ‌రూ న‌ష్ట‌పోవ‌ద్ద‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>