కలం, ఖానాపూర్: గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు.
దండారి ఉత్సవాల నిర్వహణకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని, ఉట్నూర్, భద్రాచలంలోని డీఎడ్, బీఎడ్ కళాశాలల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. గిరిజన యువతకు పోటీ పరీక్షల శిక్షణ అందించేందుకు ఐఏఎస్ అకాడమీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు, పురుషులకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కేస్లాపూర్ నాగోబా జాతర అభివృద్ధికి రూ.21 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడంతో పాటు, రహదారుల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌కు ఎమ్మెల్యే (Vedma Bojju Patel ) కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : స్వర్ణ విజేతలకు రాష్ట్రపతి ప్రశంసలు
Follow Us On: Instagram

