బాలింత మృతి ఘటన.. ప్రభుత్వాసుపత్రి వర్గాల వివరణ

కలం, వనపర్తి: వనపర్తి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (Wanaparthy Govt Hospital) లో బాలింత మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో, కొన్ని టీవీ ఛానళ్లలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. బాలింత మృతి ఘటన వనపర్తిలోని ప్రజా వైద్యశాల అనే ప్రైవేటు ఆసుపత్రిలో జరిగినట్లు తెలిపారు. మృతి చెందిన బాలింత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రి వద్ద తీసిన వీడియోలు, దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. మృతి ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను సంబంధిత వర్గాలు కోరాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తీసుకురావడం మాత్రమే జరిగిందని స్పష్టం చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>