ఇండి కూటమి కీలక తీర్మానాలు.. అక్టోబర్ 2 నుంచి సేవ్​ డెమొక్రసీ మార్చ్​

కలం, వెబ్​ డెస్క్​ : కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, సర్​ ప్రక్రియ పై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇండి కూటమి (INDI Alliance Bloc) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ సమావేశంలో ఆమోదం తెలిపిన పలు కీలక తీర్మానాలను ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

అక్టోబర్ 2 తేదీ నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’ నిర్వహించనున్నట్లు ఖర్గే వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిని కలిసి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఖర్గే (Mallikarjun Kharge) వెల్లడించారు. అక్టోబర్ 6 వ తేదీన ఇండి కూటమి(INDI Alliance)కి చెందిన ఎంపీలంతా కలిసి ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్దకు మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

అలాగే దేశవ్యాప్తంగా ఐదు భారీ సభలు నిర్వహించనున్నట్లు ఖర్గే వెల్లడించారు. నవంబర్ 1న ఢిల్లీలో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ల ఎదుట కూడా ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

Also Read : నేను నోరు విప్పితే సమస్యలొస్తయ్: కేఏ పాల్ హెచ్చరిక!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>