డెఫ్ అండ్ డమ్ ఫ్యాన్‌ను కలిసిన ఎన్టీఆర్.. స్వీట్ సర్‌ప్రైజ్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) తన అభిమానుల పట్ల ఉన్న ఆప్యాయతను మరోసారి చాటుకున్నారు. ‘దేవర’ రీ రిలీజ్ సందర్భంగా థియేటర్‌లో సందడి చేసిన ఓ వీరాభిమానిని తారక్ తాజాగా స్వయంగా కలిశారు. చెవిటి, మాట్లాడలేని ఆ అభిమాని(Deaf and Dumb Fan) ‘దేవర’ రీ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అతడిని గుర్తుపెట్టుకున్న తారక్.. నిన్న జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Dont Trouble The Trouble) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వ్యక్తిగతంగా కలిశారు. ఈ సందర్భంగా అభిమానితో కొంత సమయం గడిపి అతడికి ఈ కలయికను జీవితాంతం గుర్తుండిపోయేలా చేశారు. ఎన్టీఆర్‌ను స్వయంగా కలిసిన ఆనందంతో ఆ అభిమాని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ ప్రత్యేకమైన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>