వివేకా హత్య కేసులో జగన్ మౌనం వీడాలి: మంత్రి నిమ్మల డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) వెంటనే నోరు విప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala) తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. వివేకా కేసులోని దస్తగిరి, సునీల్ యాదవ్ వాంగ్మూలాలపై జగన్ సమాధానం చెప్పాలని, ఈ హత్య వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టాలని ఆయన కోరారు.

ఈ కేసులో సునీల్ యాదవ్ వాంగ్మూలంలో జగన్ పేరుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయని గుర్తుచేశారు. రూ. 40 కోట్ల సుపారీ ఆరోపణల వ్యవహారంలో జగన్ మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని, సాక్షుల వాంగ్మూలాలపై ఆయన వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాలని నిమ్మల రామానాయుడు (Minister Nimmala) స్పష్టం చేశారు. అయితే వివేకానందరెడ్డి దారుణ హత్య ద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా లబ్ధి పొందింది జగన్ కుటుంబమేనని తెలిపిన మంత్రి.. ఈ కేసులో దాచడానికి ఇక ఏమీ లేదని, ఇప్పటికైనా జగన్ మీడియా ముందుకు వచ్చి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. సీఎంకు ఆహ్వానం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>