కలం, వనపర్తి: వనపర్తి జిల్లా కేశంపేట గ్రామం (Keshampet Village) లో దశాబ్దాలుగా వేధిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. రేవల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు, కేశంపేట సర్పంచ్ బాదేపల్లి రేవతి సురేష్‌గౌడ్ ఆధ్వర్యంలో పనులను చేపట్టారు. గ్రామంలోని పలు వీధుల్లో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.
పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు శాశ్వతంగా మురుగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేశంపేటను మండలంలోనే కాకుండా జిల్లాలోనూ ఆదర్శవంతమైన, పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. డ్రైనేజీ పనులు ప్రారంభించడంపై గ్రామస్థులు, వార్డు సభ్యులు, యువత హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

