చివరి కోరిక తీర్చండి: అమెరికాలో తెలుగు యువకుడి రిక్వెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : అడ్వాన్స్‌డ్ హెపటోసెల్యులార్ కార్సినోమా (కాలేయ కాన్సర్) వ్యాధితో గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో పోరాడుతున్న భరత్ (Bharat USA) అనే తెలుగు యువకుడు తనకు ఆఖరి నిమిషాల్లో స్వదేశానికి చేరుకోవాలని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు కూడా తక్కువ సమయం మాత్రమే ఉందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తన సొంత గడ్డ అయిన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి, తన కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య గడపడమే తన ఏకైక కోరిక అని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యల వల్ల సాధారణ విమానాల్లో ప్రయాణించడం సాధ్యం కాదని, అమెరికా నుండి భారతదేశానికి చేరుకోవడానికి అత్యవసరంగా మెడికల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ లేదా ఎయిర్ అంబులెన్స్ సహాయం అవసరమని భరత్ వివరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వం, ఎన్ఆర్టీఎస్ (APNRTS) భారత ప్రభుత్వానికి ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. తాను కడసారిగా కుటుంబ సభ్యులను చూసుకునేందుకు వీలుగా స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని, తన ఆఖరి కోరికను నెరవేర్చాలని వేడుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>