కలం, దిలావర్‌పూర్ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దిలావర్‌పూర్ మండలం కంజర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, టీఎస్‌యూటీఎఫ్ సభ్యుడు పైడిపల్లి భోజన్న కుటుంబానికి టీఎస్‌యుటీఎఫ్ (TSUTF) అండగా నిలిచింది. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుటుంబ సంక్షేమ నిధి పథకం ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సహాయ చెక్కును సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్, రాష్ట్ర ఎఫ్‌డబ్ల్యూఎఫ్ బాధ్యులు సింహాచలం, వెంకటప్ప చేతుల మీదుగా భోజన్న కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజాయితీగల జిల్లా నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. భోజన్న కుటుంబానికి టీఎస్‌యుటీఎఫ్ కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దాసరి శంకర్, ప్రధాన కార్యదర్శి పెంట అశోక్ తదితరులు పాల్గొన్నారు.

