కోహ్లీతో బంధంపై హిట్‌మ్యాన్ హాట్ కామెంట్స్!

కలం, స్పోర్ట్స్​ : రోహిత్ శర్మ (Rohit Sharma).. విరాట్ కోహ్లీ (Virat Kohli). ఇద్దరి కెరీర్లు దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసి సాగుతున్నాయి. మధ్యలో కెప్టెన్సీలు మారాయి. పాత్రలు మారాయి. కానీ.. తమ మధ్య బంధం మాత్రం మారలేదని రోహిత్ స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య బలమైన స్నేహం, పరస్పర గౌరవం ఉందని చెప్పాడు. ఆట తీరు వేరైనా.. టీమ్‌ ఇండియా కోసం ఇవ్వాల్సింది మాత్రం ఇద్దరి లక్ష్యమని తెలిపాడు. కోహ్లీతో ఇప్పటికీ బ్యాటింగ్ గురించి చర్చిస్తుంటానని రోహిత్ వెల్లడించాడు. తన ఆటలో ఏదైనా మార్పు అవసరమైతే కోహ్లీ సూచిస్తాడని చెప్పాడు. అలాగే కోహ్లీ ఆటపైనా తాను తన అభిప్రాయం చెబుతుంటానని తెలిపాడు.

టీమ్‌ ఇండియా కోసం కోహ్లీ చేసిన సేవలు అందరికీ తెలుసని రోహిత్ (Rohit Sharma) పేర్కొన్నాడు. ఇక ముందూ అదే పట్టుదలతో ఆడి.. పరుగులు చేసి.. జట్టును గెలిపించేందుకు కోహ్లీ ప్రయత్నిస్తాడని చెప్పాడు. కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నా.. తాను ఉన్నా.. ఇద్దరి ఆలోచనలో టీమ్‌ ప్రయోజనమే ముందుంటుందని రోహిత్ తెలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్ గురించి కోహ్లీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రోహిత్ అన్నాడు. ప్రపంచకప్ అంటే ఏంటో కోహ్లీకి బాగా తెలుసని పేర్కొన్నాడు. ఇప్పుడు క్రికెట్‌కు బయట ఇద్దరూ కుటుంబాలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయినా.. తమ మధ్య బంధంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని రోహిత్ స్పష్టం చేశాడు.

Also Read : రెండో వన్డేలో నమన్ ధీర్ వద్దు: ఆకాశ్ చోప్రా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>