రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం బీఆర్‌ఎస్ పోరుబాట

కలం, మెదక్ బ్యూరో : రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను (Ramayampet Revenue Division) తక్షణమే ఏర్పాటు చేయాలని, లేకుంటే దసరా పండుగ తర్వాత ఉద్యమాలను ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రామాయంపేటలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.

గతంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రామాయంపేట డివిజన్‌ను ప్రకటించారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇన్‌చార్జ్ ఆర్డీవోను కూడా నియమించడం జరిగిందని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఆ తర్వాత ఇన్‌చార్జ్ ఆర్డీవోను తొలగించారని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ను నిలిపివేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభీష్టం మేరకు రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే డివిజన్ ఏర్పాటు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>