వృద్ధుల రక్షణ, సైబర్ భద్రతపై అవగాహన సదస్సు

కలం, నిర్మల్ : వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత, వృద్ధులపై దుర్వినియోగం నివారణ అంశాలపై ప్రత్యేక అవగాహన (Cyber Safety Awareness) కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజంలో పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల వయోవృద్ధులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఓటీపీ, పిన్ సంఖ్య, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ ఖాతా సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరికీ తెలియజేయకూడదని అవగాహన (Cyber Safety Awareness) కల్పించారు. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రకటనలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. డిజిటల్ సేవలను సురక్షితమైన పద్ధతిలో ఎలా వినియోగించుకోవాలో వివరించారు.

వృద్ధులపై జరిగే శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులను త్వరితగతిన గుర్తించి నివారించేందుకు తగిన సలహాలు అందించారు. వృద్ధుల భద్రత, స్వేచ్ఛ, సంక్షేమం కాపాడేందుకు ప్రభుత్వ శాఖలు, న్యాయ సేవా సంస్థలు, పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సైబర్ వింగ్ ఎస్ఐ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఇందిరమ్మ టవర్స్.. ఏడాదిలోపే ఇళ్ల తాళాలు: పొంగులేటి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>