కలం, కుభీర్: కుభీర్ (Kubeer) మండలంలోని ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel) మంగళవారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ధార్ కుభీర్‌లో మహిళా సమైక్య సంఘ భవనం, గోదాం నిర్మాణంతో పాటు బెల్గావ్లో వీవో భవనాలు, అంగన్వాడీ కేంద్రం, గోదాం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ధార్ కుభీర్ నుంచి బెల్గావ్ వరకు రహదారి సౌకర్యం సరిగా లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజల ప్రయాణ సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. బెల్గావ్లో చెరువు నుంచి పంట పొలాలకు సాగునీరు అందించేందుకు రెండు కెనాల్స్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్థుల సమస్యలపై ఎమ్మెల్యే పటేల్ స్పందిస్తూ.. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చెరువుల మరమ్మతులు, నీటి నిల్వ కోసం కెనాల్స్ నిర్మాణం, పంట పొలాలకు వెళ్లే రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

