అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా చూడాలి: ఖీమ్యానాయక్

కలం, వనపర్తి: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన రక్తం జిల్లా బ్లడ్‌ బ్యాంకులో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎన్‌. ఖీమ్యా నాయక్‌ సూచించారు. మంగళవారం వనపర్తి (Wanaparthy) కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్లో జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ (Red Cross Society) నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికల అధికారి డీపీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారిని ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌గా అమరేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ప్రియాంక, కోశాధికారిగా చిన్న గోవిందు విష్ణువర్ధన్‌, స్టేట్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యుడిగా ఎల్ల భాస్కర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అంకితభావంతో పనిచేస్తూ తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో రక్తం కొరత రాకుండా నిల్వలు ఉండేలా చూడాలని, జిల్లాలో అధిక సంఖ్యలో రెడ్‌క్రాస్‌ సభ్యత్వం నమోదయ్యేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>