కలం, రాజన్న సిరిసిల్ల: తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో మంజూరు చేయించిన తంగళ్లపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఒక్కో తరగతి గదిని సందర్శిస్తూ విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. వారి చదువులు, యోగక్షేమాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోకరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా చురుకుగా పాల్గొనాలని మంత్రి సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి (Ponnam Prabhakar) సరదాగా ముచ్చటిస్తూ పాటలు పాడించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాటలు పాడుతూ మంత్రితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థుల చిరునవ్వులు, వారి ప్రతిభను ప్రోత్సహించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Also Read : కేటీఆర్.. కేసీఆర్ కొడుకు కాకపోతే రాజకీయ ఉనికి లేదు: అద్దంకి దయాకర్
Follow Us On: X(Twitter)

