మయన్మార్‌లో వైమానిక దాడి: హోల్‌సేల్ మార్కెట్‌పై బాంబుల వర్షం

కలం, వెబ్ డెస్క్ : మయన్మార్‌లో మిలిటరీ సైన్యం మరోసారి విరుచుకుపడింది. పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో తిరుగుబాటు దళమైన అరకాన్ ఆర్మీ (Arakan Army) ఆధీనంలో ఉన్న క్యూక్టా (Kyauktaw) పట్టణంలోని హోల్‌సేల్ మార్కెట్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సైనిక యుద్ధ విమానం బాంబుల వర్షం (Myanmar Airstrike) కురిపించింది. వ్యాపారులు, కొనుగోలుదారులతో సందడిగా ఉన్న సమయంలో రెండు బాంబులు ఒకేసారి పడటంతో అక్కడికక్కడే 49 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ భీకర దాడిలో మరొక 58 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

బాంబు దాడి ధాటికి పరిసరాల్లోని భవనాలు, వాహనాలు తగలబడి శబ్దాలతో కూలిపోయాయి. 2021లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాడులతో వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతుండగా, రఖైన్ ప్రాంతంలో సైన్యం, అరకాన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఈ దారుణారణకాండపై అరకాన్ ఆర్మీ స్పందిస్తూ అతి త్వరలోనే సైన్యానికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.

Also Read: తెలంగాణలో జల సంక్షోభం ముప్పు..ఇక కష్టాలేనా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>