ఘట్‌కేసర్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి

కలం, వెబ్ డెస్క్: రైలు ఢీకొని దాదాపు 100 గొర్రెలు మృతిచెందిన విషాద ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఘట్‌‌‌కేసర్ (Ghatkesar) రైల్వే స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గొర్రెల కాపరి వాటిని మేపడానికి రైల్వే పట్టాల సమీపానికి తీసుకువచ్చాడు. ఈ సమయంలో ఆయన నిద్రిస్తుండగా, కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లికి వెళ్తున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఆ రైలు శబ్దానికి భయపడిన గొర్రెలు ఒక్కసారిగా పరుగులు తీశాయి.

ఈ క్రమంలో అవి పట్టాలపైకి రావడంతో వేగంగా దూసుకొచ్చిన రైలు వాటిని ఢీకొట్టింది (Train Accident). ఈ ప్రమాదంలో సుమారు 100 గొర్రెలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాయి. మృతిచెందిన గొర్రెలు యాదాద్రి–భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన యజమానులవిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>