రెస్టారెంట్లకు నోటీసులు.. నిర్వాహకుల నో రెస్పాన్స్!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో (Hyderabad Restaurants) కొద్ది రోజులుగా టీజీ సేఫ్ అధికారులు వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దారుణమైన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వంటల్లో వాడుతూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ పరిధిలోని 11 రెస్టారెంట్లకు నోటీసులు, లైసెన్సులు సస్పెండ్ చేశారు. రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాన్ని ఉపయోగిస్తుండటం.. దుర్గంధంగా కిచెన్ నిర్వహణ, సిబ్బంది ఏమాత్రం పరిశుభ్రత పాటించకపోవడం వంటివి గుర్తించి నోటీసులు అందించారు.

మరోసారి నోటీసులు జారీ..

నోటీసులను రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకుండా.. మరుసటి రోజు నుంచే యథావిధిగా తెరిచేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో టీజీ సేఫ్ అధికారులు స్పందించారు. ఆదేశాలను ధిక్కరించిన రెస్టారెంట్లు, హోటళ్లకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేస్తూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక నుంచి నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని తెలిసినా తమకు సమాచారం అందించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>