భగత్ సింగ్ ఆశయ సాధనకు పోరాడాలి : సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్

కలం, నిర్మల్ : భగత్ సింగ్ స్ఫూర్తితో దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం పోరాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య పిలుపునిచ్చారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో భగత్ సింగ్ 119వ జయంతి సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాదని, దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం కలలుగన్న గొప్ప మార్క్సిస్టు మేధావి అని కొనియాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక వర్గాలు భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా (Nirmal) కార్యదర్శి రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు రామ లక్ష్మణ్, బక్కన్న, లక్ష్మి, గంగన్న, మహేందర్, గఫూర్, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>