ప్రజావాణి ఫిర్యాదులపై రాజర్షి‌షా కీలక ఆదేశాలు

కలం, ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజావాణి పోర్టల్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును (Prajavani Complaints) నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి‌షా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.

ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని (Collector Rajarshi Shah) అధికారులకు సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకే సమస్యపై పదేపదే ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఆర్.ఎస్. చిత్రు, డీఆర్వో స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>