కలం, వెబ్ డెస్క్: మంత్రాలు చేస్తుందనే నెపంతో వృద్ధురాలిపై కొందరు గ్రామస్థులు విచక్షణరహితంగా దాడికి పాల్పడిన ఇది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి (Nomula Village) చెందిన పల్లటి వెంకటమ్మ (60) చేతబడి చేస్తోందని గ్రామస్థులు బలంగా నమ్ముతున్నారు. ఇటీవల కాలంలో కొందరి ఇళ్లల్లో చోటు చేసుకున్న పరిణామాలకు ఆమెనే బాధ్యురాలిగా భావించిన వారు.. వెంకటమ్మ ఇంటికి వెళ్లారు. లోపలి నుంచి బయటకు తీసుకొచ్చి ఆమెపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా.. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఓ యువకుడు ఆమెపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరలవుతోంది.
14 మందిపై కేసులు నమోదు..
గ్రామస్థుల దాడిలో పల్లటి వెంకటమ్మ (Pallati Venkatamma) తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు మంచాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెపై దాడి చేసిన 14 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. గ్రామానికి (Nomula Village) చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Also Read : ఆ ఎన్నికల్లో గెలవడమే మొదటి లక్ష్యం: కవిత
Follow Us On: X(Twitter)

