కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో దందా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ (Revanth Reddy) పేదవాళ్లను కొట్టి పెద్దలకు పెట్టే ఆలోచన చేస్తున్నాడని.. అందుకే బుల్లెట్ ట్రైన్ పేరు మీద సుమారు రూ. 5 వేల కోట్లు విలువ చేసే 650 ఎకరాల బహుదూర్‌గూడ భూమి మీద రేవంత్ రెడ్డి కన్ను వేశారని ఆరోపించారు.
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ (The Paradise) సినిమా లాంటిదని కేటీఆర్ అన్నారు. ఆ సినిమాలో వాళ్లు గుర్తింపు కోసం కొట్లాడారని.. కానీ ఇక్కడ రైతులు వాళ్ల భూమి కోసం పోరాడుతున్నారని తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం సేకరించిన భూముల్లోనే బుల్లెట్ ట్రైన్ పెట్టొచ్చు కదా! అంటూ చెప్పుకొచ్చారు. భూములు కొనడం, అమ్మడం, కమీషన్లు తీసుకోవడం.. ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం తీసుకున్న భూమిలో 3 వేల ఎకరాలు ఖాళీగా ఉందన్న కేటీఆర్ (KTR).. ఆ భూముల నుంచి బుల్లెట్ ట్రైన్ (Bullet Train Project) కోసం తీసుకోరాదా? అంటూ ప్రశ్నించారు. అధునాతన టెక్నాలజీతో ఫార్మా సిటీ నిర్మాణం కోసం ఏడేళ్లు కష్టపడి చట్టప్రకారం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశామని అన్నారు. ఈ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు అన్ననారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అవే భూములతో ఫ్యూచర్ సిటీ పేరు దందా చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బినామీలు 4 నుంచి 5 వేల ఎకరాల భూమి తీసుకొని పెట్టుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : రాహుల్ గాంధీ చెప్పిందే నిజమైంది: భట్టి విక్రమార్క
Follow Us On: X(Twitter)

