కలం, నిర్మల్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన (Congress Protest) చేపట్టారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం(Congress Protest)లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : సీఎం విజయ్ సరికొత్త స్కీమ్.. పసిబిడ్డలకు ఫ్రీ గోల్డ్ కానుక!
Follow Us On : WhatsApp

