కారును ఢీకొట్టిన కంటైనర్.. అదనపు కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

కలం, నార్కట్‌పల్లి : జాతీయ రహదారి-65పై నార్కట్‌పల్లి (Narketpally)  కామినేని ఫ్లైఓవర్ వద్ద సోమవారం పెను ప్రమాదం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ధారా వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఒక కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కలెక్టర్ కారులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం దెబ్బతిన్నప్పటికీ, అదనపు కలెక్టర్ ధారా వేణుగోపాల్‌తో పాటు వాహనంలో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు (Narketpally Police) తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, కంటైనర్‌ను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : ఆసియా గేమ్స్: కురాష్‌లో పింకీ బల్హారాకు కాంస్య పతకం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>