కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ 2026లో(Asian Games) భారత కురాష్ అథ్లెట్ పింకీ బల్హారా (Pincky Balhara) కాంస్య పతకం సాధించి మెరిశారు. సోమవారం నగోయాలో జరిగిన మహిళల 78 కేజీల కేటగిరీ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన సూమిన్ మో చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైన పింకీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. 27 ఏళ్ల పింకీ బల్హారాకు ఆసియా గేమ్స్‌లో ఇది రెండో పతకం కావడం విశేషం. అంతకుముందు 2018 జకార్తా ఆసియా గేమ్స్‌లో మహిళల 52 కేజీల విభాగంలో ఆమె వెండి పతకం సాధించారు. తాజాగా 78 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకోవడంతో మరోసారి ఆసియా వేదికపై సత్తా చాటారు.
ఈ టోర్నీలో పింకీ (Pincky Balhara) ప్రయాణం అద్భుతంగా సాగింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన గారమ్ లిమ్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో ‘చాలా’ పాయింట్ సాధిస్తూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే సెమీఫైనల్లో సూమిన్ మో ‘యోన్బోష్’ పాయింట్ సాధించగా, పింకీకి ‘డక్కి’ పెనాల్టీ పడింది. దీంతో ఆమెకు మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. చివరకు 0-5 తేడాతో ఓటమి చవిచూశారు. పింకీ సాధించిన ఈ కాంస్య పతకంతో ఆసియా గేమ్స్ కురాష్ విభాగంలో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. ప్రస్తుతం ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ 39 పతకాలతో ముందుకు సాగుతోంది. పింకీ బల్హారా ప్రదర్శన భారత క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
Also Read : సీఎం విజయ్ సరికొత్త స్కీమ్.. పసిబిడ్డలకు ఫ్రీ గోల్డ్ కానుక!
Follow Us On: X(Twitter)

